వెంకటాపురం వాజేడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

15-10-2026 | 05:36pm

ములుగు జిల్లా :కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు(Presidents of the Congress Party) పైడకుల అశోక్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క సూచనల మేరకు, గురువారం ములుగు జిల్లా లోని వెంకటాపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మండల కేంద్రం లోని సయ్యద్ హుసేన్ ని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది.

అదేవిధంగా వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన కాకర్లపూడి విక్రాంత్ ని ఏకగ్రీవంగా ప్రకటించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నిక అయినా హుస్సేన్ కి, విక్రాంత్ కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలం లోని సీనియర్ & జూనియర్ అనే తేడా లేకుండా రానున్న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో అన్ని స్థానాలలో గెలిచేలా సమన్వయము తో ముందుకు సాగాలి అని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ కోరడం జరిగింది

మరిన్ని వార్తలు