ప్రతి సంఘ సభ్యురాలకు ఈ కేవైసీ చేయండి
బోథ్. నవంబర్ 27 ( విజయక్రాంతి) మహిళ సంఘంలో(Women's Association) ఉన్న ప్రతి సభ్యురాలికి ఈనెల 30వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేయించాలని ఏపిఎం గణేష్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మండలంలోని సీసీ, లతోపాటు వివో ఏ లకుగ్యాస్ బోర్డ్ పై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతేగాక ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రతి వివో ఏ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అందుకు సీసీలు కార్యక్రమానికి సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు ఉండడం వల్ల నిర్లక్ష్యం చేయవద్దన్నారు. శిక్షణ కార్యక్రమంలో టిఓటి ఏటీఎం వెంకటరెడ్డి ,సిరికొండ మండలం అకౌంటెంట్ జాన్ తో పాటు పలు సంఘాల సభ్యులు ఉన్నారు.