పీఆర్టీయూ టీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఐదోసారి జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
ప్రధాన కార్యదర్శిగా సురుకుంటి వినోద్‌రెడ్డికి 68 ఓట్ల మెజారిటీ
ఆదిలాబాద్: విజయ క్రాంతి: పీఆర్టీయూ టీఎస్ ఆదిలాబాద్ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షుడిగా శ్రీ కొమ్ము కృష్ణకుమార్ ఐదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో శ్రీ సురుకుంటి వినోద్‌రెడ్డి తన ప్రత్యర్థి శ్రీ కొడిమెల మధుసూదన్‌రెడ్డిపై 68 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఎన్నికల అధికారులుగా నిర్మల్ జిల్లా పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షులు బి. రమణరావు, ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు వ్యవహరించారు.
ఎన్నికల ప్రక్రియను వారు పర్యవేక్షించారు.ఈ కార్యక్రమానికి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి సురుకుంటి వినోద్‌రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 1న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండు డీఏలు ప్రకటించేలా కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులకు పలువురు ఉపాధ్యాయులు, సంఘ నాయకులు అభినందనలు తెలిపారు.