ఏ హెచ్ ఎస్ పార్కలగండిని తనికీ చేసిన డి డి

01-10-2026 | 07:02pm

దమ్మపేట, అక్టోబర్ 01(విజయ క్రాంతి): ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎం మనెమ్మ(Tribal Welfare Deputy Director M Manemma) పార్కలగండి పాఠశాలను(Parkalagandi School)  గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క ప్రగతిపై పరిశీలన చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్ ఏ 1 పరీక్షలకు సంబంధించిన భౌతిక శాస్త్రం సబ్జెక్టు మీద ప్రశ్నలు అడిగారు.

8, 9వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించే విధానాన్ని పరిశీలించారు. వసతి గృహంలోని డార్మెటరీ, కిచెన్, స్టోర్ రూమ్, విద్యార్థుల యొక్క హెల్త్ రికార్డులను పరిశీలన చేశారు. మినరల్ వాటర్ ట్యాంక్ పరిశీలన చేసి, అనంతరం కంప్యూటర్ ల్యాబ్ నందు విద్యార్థులకు సపరేట్ టైం టేబుల్ ఇచ్చి కంప్యూటర్లు ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, దమ్మపేట ఏ టి డబ్ల్యూ ఓ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు