నానో యూరియా.. నానో డీఏపీ మీద అవగాహన
మండల వ్యవసాయ అధికారి నవీన్
వెంకటాపురం,(విజయక్రాంతి): మండలంలోని రాచపల్లి గ్రామం(Rachapalli Village)లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(Agricultural Technology Management Agency) పథకం కింద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకి నానో యూరియా(Nano Urea), నానో డీఏపీ మీద అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నవీన్ రైతుల(Farmers )తో మాట్లాడుతూ సాంప్రదాయ యూరియా డిఏపి బస్తాల కోసము రైతులు ఇబ్బంది పడకుండా అంతే సమర్థవంతంగా పనిచేసే నాన యూరియా నానో డీఏపీలను పంటల మీద పిచికారి కోసం వాడుకోవచ్చని తెలిపారు. నానో యూరియా 500, నానో డిఏపి 500 చొప్పున మొక్క నాటిన 30 రోజుల తర్వాత నుండి పిచికారికి వాడుకోవచ్చని వీటివల్ల ఎరువుల ఖర్చు తగ్గి పెట్టుబడి తగ్గుతుందని తద్వారా రైతుకి మేలు జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్యాం కుమార్, గ్రామ రైతులు పాల్గొన్నారు.