పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి భరోసా
అర్హులైన లబ్ధిదారులకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందజేత
కరీంనగర్,సిటీ నవంబర్ 20 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) నగరంలోని 36వ డివిజన్ మారుతి నగర్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు(Cheques) ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Ministers Relief Fund) (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల విలువైన చెక్కులను 36వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దొంతి గోపి(Donthi Gopi) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని తెలిపారు.
సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.