కాలభైరవ స్వామి మాల దీక్ష ప్రారంభం

20-11-2026 | 04:47pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో కాలభైరవ స్వామి 11 రోజుల మాల దీక్ష ప్రారంభమైంది.దేవస్థాన ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి భక్తులకు మాలధారణ చేయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు దీక్ష స్వీకరించారు.డిసెంబర్ 1న కాలాష్టమి సందర్భంగా దీక్ష విరమణ, స్వామివారికి ప్రత్యేక పూజలు, సామూహిక హోమాలు, దీపారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు