విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధం
కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలతో ప్రమాదం..
తృటిలో తప్పిన ప్రాణాపాయం
హత్నూర, నవంబర్ 20: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ శివారులో శుక్రవారం ప్రమాదం(accident) చోటుచేసుకుంది. రైతు కిష్టయ్య(Farmer Kishtaiah) వ్యవసాయ పొలంలో(Agricultural field) వరి కోతలు కోస్తున్న హార్వెస్టర్ యంత్రానికి(Harvester machine) కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు(Electric wires) తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు యంత్రం అంతటా వ్యాపించడంతో హార్వెస్టర్ పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై యంత్రం నుంచి కిందకు దిగి దూరంగా పరుగెత్తడంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, విద్యుత్ అధికారులు స్పందించి ప్రమాదకరంగా వేలాడుతున్న తీగలను సరిచేయాలని కోరుతున్నారు.