ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకం(Indiramma Jeevitha Kutumba Bima Scheme) అని భీంపూర్ మండల ప్రత్యేక అధికారి గోపి కిషన్ అన్నారు. శుక్రవారం భీంపూర్ మండలం గోన, అందర్ బంద్,కరణ్వాడి,ఖైరిగూడ,మార్కగూడ,నిపాని గ్రామపంచాయతీలలో ఎంపీడీవో గడ్డం గోపాలకృష్ణారెడ్డి(MPDO Gaddam Gopalakrishna Reddy)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి మరణించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా భరోసా కల్పించడం పథకం ప్రధాన ఉద్దేశం అని అన్నారు. కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న ఒక వ్యక్తికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుందని అన్నారు... నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18, 2026 వరకు నెల రోజులపాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహిస్తున్నాం.
అర్హులు తమ ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, రేషన్ కార్డ్ మరియు మొబైల్ నెంబర్ తో ఈ శిబిరాలకు వెళ్లి ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాడవి కమల, భీంరావ్,ఉపసర్పంచ్ ముశ్రాన్ అహ్మద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్,గ్రామ పెద్దలు జహూర్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శలు వంశీ కృష్ణ,సంధ్య రాణి,ప్రవీణ,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు...