కొలం గూడ లలో దండారి సంబరాలు
ఫ్రూట్ వాయిస్తూ... చేతులతో డబ్బులు కొడుతూ...
ఉట్నూర్, నవంబర్06 ( విజయక్రాంతి): దీపావళి పండుగ(Festival of Diwali) సందర్భంగా ఆదివాసి తెగలోని(Tribal community) గోండులు, కొలంలు దండారి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. రెండు తెగలలో దండారి ఉత్సవాలను(Dandari festivals) భిన్నంగా జరుపుకుంటారు. కొలం గిరిజనులు అడవిలో దొరికే వెదురు కర్రతో ఫ్రూట్ తయారుచేసి డప్పులను చేతితో వాయిస్తూ ... గుస్సాడీలతోపాటు యువకులను నృత్యం చేసే విధంగా వాయిస్తూ ఉంటారు.
గోండులు మాత్రం దండారి ఉత్సవాల సందర్భంగా తుడుం కొడుతూ.. డప్పుల కర్రతో డప్పులను వాయిస్తూ.. నృత్యం చేసే విధంగా డప్పులను వాయిస్తూ ఉంటారు.. ఒక్కొక్క ఆటకు ఒక్కొక్క రకంగా డప్పులను కొడుతుండగా... కొలం గిరిజనులు చేతితో నృత్యం చేసే విధంగా కొడుతూ.. నృత్యం చేయిస్తారు.. రెండు తెగల వర్గాల గిరిజనులు వారి వారి సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ.. ఆచార వ్యవహారాల ప్రకారం దండారి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు.