కుమారి లో ఘనంగా దుర్గామాత బోనాల పండుగ..

16-10-2026 | 05:34pm

బోథ్. అక్టోబర్ 16 ( విజయ క్రాంతి): నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ జాతర(Bonalu Festival Fair) నిర్వహించారు. జాతరలో మహిళలు మంగళహారతులు పట్టుకొని బోనాలు ఎత్తుకొని దుర్గామాతకు. నైవేద్యాలు సమర్పించుకున్నారు. శివసత్తుల, పోతరాజుల విన్యాసాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలపొంది. యువకులు మహిళలు భవాని మాలలు వేసుకొని భక్తిశ్రద్ధలతో దీక్షలో పాల్గొన్నారు. ఊరేగింపులో భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు