గుస్సాడికి వేలాయే-గూడేళ్లు సందడికి సన్నాహాలు

21-10-2026 | 04:44pm

బోథ్. అక్టోబర్ 19 (విజయక్రాంతి) దసరా పండగ ముగిసిన వెంటనే ఆదివాసి గిరిజన(Adivasi Tribal) గూడెంలో గుస్సాడీ పండుగ వేడుకలు(Gussadi Festival Celebrations) ప్రారంభమవుతాయి. దీపావళి పండుగను(Festival of Diwali) ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పరస్పర స్నేహానికి బంధుత్వానికి పండుగ ఎంతో ప్రాధాన్యత నిస్తుంది. గిరిజన ఆదివాసి గూడేలలో యువకులు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పండుగ వేడుకలలో పాల్గొంటారు వారం రోజులపాటు పొలం పనులకు స్వస్తి చెప్పి పండుగ వేడుకలను జరుపుకుంటారు ఈ సంవత్సరం అతిథ్యానికి వెళ్లిన గ్రామ గుస్సాడీలకు ఆయా గ్రామాల వారు ఎంతో గౌరవించి స్వాగతం పలికి భోజనాలు పెట్టి పంపిస్తారు. వచ్చే సంవత్సరం ఈ ఏడాది వెళ్లిన గ్రామస్తుల గూడెం కి వస్తారు. దీంతో పరస్పర బంధుత్వాలు బలపడతాయని అంటున్నారు.....

నెమలి టోపీలు డప్పుల తయారీ.....

దీపావళి పండుగ కు ముందు నుండి వారం రోజులపాటు జరుపుకునే గుస్సాడీలకు అవసరమైన నెమలి ఈకల టోపీలను తయారు చేసుకుంటున్నారు అంతేగాక డప్పులను సైతం తయారుచేసి వారి వారి గ్రామాలకు తీసుకు వెళుతున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలను ఊరంతా కలిసి జరుపుకోవడం అన వాయిదిగావస్తున్నది.

పెళ్లి చూపులకు వేదిక.....

గుసాడి వేషాలు వేసుకొని వివిధ గ్రామాలకు వెళ్లిన యువకులకు పెళ్లి సంబంధాలు సైతం ఆయా గ్రామాల్లో కుదుర్చు  కుంటారు.

అంతేగాక గుసాడిలా వెంట వెళ్లిన యువకులకు సైతం  పెళ్లిచూపులు కుదుర్చుకుంటారని ఆదివాసి పెద్దలు పేర్కొంటున్నారు. గుస్సాడీలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం దండారి ఉత్సవాలకు డబ్బులు అందివ్వడం జరుగుతున్నది. 

డప్పుల దరువుతో ధన ధన చెప్పులు...

ఆదివాసి గిరిజన గ్రామాలలో గుసాడి ఉత్సవాలు ప్రారంభమైనప్పటినుండి డప్పుల చెప్పులతో మారు మ్రోగుతుంటాయి . యువకులు కాలికి గజ్జెలు కట్టుకొని గళ్ళు గళ్ళు మంటూ ఎగురుతుండగా ధన ధన డప్పుల మూత ఊరూరా వినిపిస్తుంది. పై చదువుల కోసం వెళ్లిన యువతి యువకులు సైతం వారం రోజులపాటు గ్రామాల్లోని ఉండి గుస్సాడీ ఉత్సవాలను తిరగిస్తుంటారు. గుసాడీలు చేసే నృత్యాలను గిరిజన గ్రామాల ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఇది ఏమైనా ఆదిలాబాద్ జిల్లాలో దండారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు