వైభవంగా జైనథ్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి పల్లకి ఊరేగింపు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): పవిత్ర కార్తీక మాసం సందర్భంగా జైనథ్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి(Jainath Lakshmi Narayana Swamy) వారి పల్లకి ఊరేగింపు(Pallaki Utsavam) అంగరంగ వైభవంగా సాగింది. జైనథ్ మండల కేంద్రంలో కొలువైన ప్రసిద్ధ లక్ష్మీ నారాయణ స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో జైనథ్ జనసంద్రంగా మారింది.
శుక్రవారం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామ పురవీధుల్లో పల్లకి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. భక్తుల గోవింద నామస్మరణతో గ్రామ పురవీధులు, ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మహిళలు మంగళ హారతులతో ముందునడవగా స్వామివారి దీక్షధారులు లక్ష్మీ నారాయణ స్వామి కీర్తనలు ఆలపిస్తూ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు.