వర్షాభావంతో ఎండుతున్న మక్క పంట
28-09-2026 | 10:09pm
తలమడుగు సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): తలమడుగు మండలం(Talamadugu Mandal)లోని రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు బొజ్జ పెద్ద గంగన్న ఆరు ఎకరాల్లో మక్క సాగు చేశారు. వర్షాభావంతో పంట ఎండిపోతుండటంతో దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.10–12 వేల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. పక్షులు సైతం పంటను నాశనం చేస్తున్నాయని వాపోయారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు.