ఒక్కొక్క దండారికి 15 వేల రూపాయలు
ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సందడి....
ఉట్నూర్, నవంబర్06 ( విజయక్రాంతి ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad District) ఆదివాసి గిరిజనులు సంస్కృతి సాంప్రదాయంగా(Culture and Traditions of Adivasi Tribal Communities) ప్రతి దీపావళి పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే దండారి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క దండారికి 15వేల రూపాయలు విడుదల చేసిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శుక్రవారం
ఉట్నూరు మండల(Utnoor Mandal) పరిధిలోని తక్కుగూడ, సలేవాడ బి, బిర్సాయిపేట్, రామ్నగర్ గ్రామాల్లో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ఆదివాసీ సంప్రదాయ గుస్సాడి నృత్యం చేశారు. ఆదివాసీ కళాకారులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సవాల్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను(Culture and traditions) కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని సూచించారు. దండారి ఉత్సవాల సమయంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా ధోతి ధరించాలని కోరారు. ప్రభుత్వం తరఫున దండారి ఉత్సవాల ప్రోత్సాహకంగా రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.