ఆవుల బాలనాదం ఆశయాలను కొనసాగించాలి

06-11-2026 | 06:58pm

ఘనంగా జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడి 5వ వర్ధంతి

పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జాతీయ మాలల ఐక్య వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం

గంభీరావుపేట, నవంబర్ 6 (విజయక్రాంతి): జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఆవుల బాలనాదం(Avula Balanadam) 5వ వర్ధంతిని శుక్రవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని జై భీమ్ చౌరస్తాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలనాదం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం దోసల చంద్రం మాట్లాడుతూ.. మాల జాతి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆవుల బాలనాదం చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతూ, మాలల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడిన మహనీయుడని అన్నారు. ఆయన ఆశయ సాధనకు మాలలంతా ఐక్యంగా కృషి చేయాలని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్కం బాబు, జిల్లా నాయకులు దోసల ఉపేంద్ర, బిట్ల శివశ్రీనివాస్, బరిగెల అభిలాష్, ఏడబోయిన ప్రభాకర్, ఆదిత్య, బంటు కిషన్, దుబాసి మల్లేశం, నారాయణ, మాదాసు శ్రీనివాస్, బరిగెల బాలయ్య, బంటు శివరాజం, గాదం పాపయ్య, అంగూరి నాగరాజు, బొమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు