టచ్ స్వచ్ఛంద సంస్థను సందర్శించిన ఎం.ఎస్.డబ్ల్యూ. విద్యార్థులు

06-11-2026 | 07:05pm

పాలమూరు విశ్వవిద్యాలయం నవంబర్ 6 : పీయూ లోని ఎం.ఎస్.డబ్ల్యూ. ప్రథమ సంవత్సరం విద్యార్థులు(Students) అప్పన్నపల్లిలోని టచ్ స్వచ్ఛంద సంస్థను(Touch Charitable Organization) సందర్శించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం. గాలెన్న పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ వినయ్ సామాజిక సేవా కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్శనతో విద్యార్థులకు క్షేత్రస్థాయి సామాజిక సేవపై అవగాహన కలిగింది. పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు