ఇందిరమ్మ జీవిత బీమా నమోదు పరిశీలించిన ఎంపీడీవో
26-11-2026 | 10:09pm
బోథ్. నవంబర్ 26 ( విజయక్రాంతి) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Life Insurance Scheme) అమలు తీరును గురువారం ఎంపీడీవో ఎన్ రమేష్ బోత్ గన్నూర్ మందగూడ గ్రామాలలో పరిశీలించారు. తప్పులు లేకుండా కంప్యూటర్ ఈకరణ చేపట్టాలని సూచించారు. అంతకుముందు మంద పొగుడలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను సందర్శించి విద్యార్థుల తో మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు రోహిణి వినయ్ రెడ్డి, రాథోడ్ బాబురావు, పర్యవేక్షకులు రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శులు అశోక్, దయాకర్ కాశిరం సఖిలు పాల్గొన్నారు.