వ్యసనాలకు దూరంగా ఉండాలి.. విద్యార్థులకు సూచన

06-11-2026 | 05:55pm

తలమడుగు నవంబర్ 6 (విజయక్రాంతి): తలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మై భారత్ యువ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్(Nasha Mukt Bharat), దీపావళి స్నేహ్ మిలన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ యువత సోషల్ మీడియా వ్యసనానికి దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. మై భారత్ ప్రతినిధి రాము మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ సూరజ్ సింగ్ విద్యార్థులతో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు