అక్షరాస్యతపై వ్యాసరచన క్విజ్ పోటీలు

06-11-2026 | 07:16pm

బోథ్. నవంబర్ 6 (విజయక్రాంతి): సునాల మండల(Sunala Mandal) కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) అక్షరాస్యత పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు భారత ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాల మేరకు విద్యార్థులలో ఓటు హక్కు, ప్రజాస్వామ్యం విలువలు, ఎన్నికలపై అవగాహన, పెంపొందించేందుకు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఓటరు జాబితా ,ఓటు హక్కు, ప్రాముఖ్యత, అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ఎన్నికల ఓటర్ జాబితా తయారీ ఈవిఎం వివి డాట్ పోలింగ్ ప్రక్రియ ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ ఉపాధ్యాయులు ఉపస శ్రీనివాస్ విష్ణు చంద్రకాంత్ కుమార్ ఉపాధ్యాయ సిబ్బంది తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు