అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ వెంకన్న

13-11-2026 | 12:45pm

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలం(Talamadugu mandal)లోని కుచులపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రం-2(Kuchulapur Anganwadi Center-2)ను సర్పంచ్ మోడేపు వెంకన్న సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందిని కేంద్రంలో అందుతున్న సేవలు, పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి వారితో కొద్దిసేపు సరదాగా గడిపారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.

మరిన్ని వార్తలు