దేవాపూర్‌లో దుర్గామాతకు ఎస్సై రాధిక ప్రత్యేక పూజలు

18-10-2026 | 03:55pm

తలమడుగు అక్టోబర్ 18 (విజయక్రాంతి): తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో శ్రీ నవశక్తి దుర్గామాత మండల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తలమడుగు ఎస్సై రాధిక(SI Radhika) దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి దర్శనంతో గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పూజారి శీలం కోటి శివాజీ పంతులు, గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్, దాతాజీ కిరణ్, మేనల్వార్ మల్లన్న, నితీష్ రెడ్డి, వెంకటేష్, నారాయణ, అరవింద్, విష్ణు తదితరులతో పాటు మహిళలు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు