జనగణన శిక్షణ కార్యక్రమం

16-10-2026 | 04:57pm

నిర్మల్ అక్టోబర్ 16 ( విజయక్రాంతి): జిల్లా ప్రణాళిక శాఖ(District Planning Department) ఆధ్వర్యంలో భారత జనాభా గణన(Census of India) -2027 కు సంబంధించి మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల్లోని చార్జ్ క్లర్క్ లు, టెక్నికల్ అసిస్టెంట్లకు(technical assistants) కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం రెండవ దశ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత జనగణన సిబ్బందికి వివిధ అంశాల్లో క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. జనగణన ప్రక్రియపై(Census process) పూర్తి అవగాహన కలిగి ఉండి, ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి గంగారెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్ తెలంగాణ డి.వి. రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు