రాజులతండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
03-11-2026 | 03:25pm
ఐకమత్యంతో ఉండి అభివృద్ధి చేసుకుందాం
నవంబర్ 03, నేరడిగొండ ( విజయక్రాంతి ): గ్రామప్రజలందరు ఐకమత్యంతో ఉండి అభివృద్ధి చేసుకుందాం అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. మంగళవారం నేరడిగొండ మండలంలోని రాజులతండా గ్రామంలో రూ. 28 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్ రెడ్డి, నాయకులు రాథోడ్ సజన్, పండరి, నానక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.