బొల్లారంలో పారిశుద్ధ పనుల నిర్వాణ పరిశీలించిన ప్రత్యేక అధికారి

03-11-2026 | 04:15pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 3 (విజయ క్రాంతి):మండలంలోని బొల్లారం గ్రామంలో మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్(Special Officer Raj Kumar) పర్యవేక్షించారు.ఈ సందర్భంగా గ్రామంలో మహిళా సంఘం భవనం(Women's Association Building), అంగన్వాడి కేంద్రం,ఉపాధి హామీ పనులు, గ్రామపంచాయతీ పారిశుద్ధ పనుల నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు.

అలాగే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మాణానికి సంబంధించి చేపట్టిన మార్కింగ్ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.గ్రామంలో అందరికి ఉపాధి దొరికేలా ఉపాధి హామీ పనులు చేపట్టాలని, జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు హాజరు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్,గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభు గౌడ్,ఏపీఓ సక్కుబాయి, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ పర్వీన బేగం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు