ఎల్‌నినో ప్రభావంలోనూ ఆకట్టుకున్న వేదగోల్డ్ పత్తి పంట

15-10-2026 | 04:28pm

కజ్జర్లలో కేవీఆర్ సీడ్స్ క్షేత్ర ప్రదర్శన.. 250 మంది రైతుల సందర్శన

తలమడుగు అక్టోబర్ 15 (విజయక్రాంతి) : ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా పత్తి పంటలో ఆశాజనక ఫలితాలు సాధించవచ్చని కజ్జర్ల గ్రామంలో నిర్వహించిన క్షేత్ర ప్రదర్శనలో రైతులు అభిప్రాయపడ్డారు. కేవీఆర్ సీడ్స్‌కు చెందిన వేదగోల్డ్ బీజీ-2 పత్తి రకం క్షేత్ర ప్రదర్శనను గురువారం నిర్వహించగా, తాంసి, తలమడుగు మండలాల నుంచి సుమారు 250 మంది రైతులు పాల్గొన్నారు.

రైతు ఆడే రమేష్ సాగు చేసిన పత్తి పంటను పరిశీలించారు. వేదగోల్డ్ పత్తి రకం వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండటంతో పాటు, దగ్గరదగ్గరగా కాయలు కాయడం, బలమైన కాండం, ఆకులపై నూగు ఉండటం వంటి లక్షణాలతో తెల్లదోమ, పచ్చదోమ ఉధృతి తక్కువగా ఉండే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు వివరించారు.

పంటను పరిశీలించిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ రమేష్ కృషిని అభినందించారు.ఈ కార్యక్రమంలో కేవీఆర్ కంపెనీ బిజినెస్ హెడ్ వెంకట్ రెడ్డి, రీజినల్ మేనేజర్ కేశవ్ రెడ్డి, స్క్వేర్ కంపెనీ రీజినల్ మేనేజర్ భూమా గౌడ్, డీలర్ మొట్టే కిరణ్, డిస్ట్రిబ్యూటర్ జనకొండ శ్రీకాంత్

మరిన్ని వార్తలు