నాగేశ్వరావు ఆశయ సాధనకు కృషి చేయాలి

15-10-2026 | 05:23pm

దామరచర్ల :అక్టోబర్ 15: ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరావు(Nageswara Rao, Executive Engineer, Irrigation Department) ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం దామచర్ల మండలం కేతవాత్ తండాలో జరిగిన నాగేశ్వరరావు దిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిజాయితీగా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నాగేశ్వరావు చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.

అంచలంచెలుగా పదోన్నతులు పొంది చేసిన శాఖలో మంచి పేరు సాధించారని తెలిపారు. నాగేశ్వరావు కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పారు కార్యక్రమంలో  శాసన మండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్,శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, స్కైలాబ్ నాయక్ రవితేజ నాయక్,

బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్, అధికారులు గోపీనాథ్ డాక్టర్ జగేంద్ర కుమార్,కేశవ నాయక్, విజయలక్ష్మి,బిక్కు నాయక్,సీతారాం నాయక్ ,మత్రు నాయక్, బెజ్జం సాయి, సిద్దు నాయక్,బాల,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు