ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం
13-11-2026 | 03:45pm
బోథ్. నవంబర్ 13 ( విజయక్రాంతి): మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి మంజూరు అయిన ఎనిమిది లక్షల ఎంపీ నిధులతో(MP funds) అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ పంద్రం సుగుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి(Gram Panchayat Development) కోసం జిల్లా ఎంపీ నగేష్ విడుదలవారీగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ ఉపాధ్యాయులు తులసను భూమన్న మాజీ ఎంపీపీ కిషన్ మాజీ ఎంపీటీసీ అప్క శంకర్ మాజీ సర్పంచ్ గోపాల్ నీలకంతరావు ఆత్రం భీమ్రావు కార్యదర్శి స్వామి నల్లోల్ల శివన్న మోహన్ తోడసం యాదవ రావు తదితరులు పాల్గొన్నారు.