రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ కలయిక
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కలిసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
దమ్మపేట, నవంబర్ 13(విజయ క్రాంతి): మండల పర్యటనలో భాగంగా తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ (Ashwaraopeta MLA Jare Adinarayana) మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును వారి నివాసంలో ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒకరినొకరు పలకరించుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల మేలు, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమనే భావనతో సాగిన ఈ కలయిక అందరినీ ఆకట్టుకుంది. ప్రజా జీవితంలో రాజకీయాల కంటే మానవ సంబంధాలు ఆప్యాయతకు ఎంతో విలువ ఉంటుందని ఈ ఆత్మీయ భేటీ చాటిచెప్పింది.