అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తాం
బోథ్. నవంబర్ 13 (విజయ క్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అరులైన వారందరికీ తప్పనిసరిగా అందించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్లెం విట్టల్, ఉపాధ్యక్షులు రాథోడ్ రమేష్ నాయక్ ,,సయ్యద్ సల్మాన్, బత్తిని కీర్తి రమణ ,జాదవ్ గణేష్, నరసయ్య ,గొల్ల నాగు రమేష్ తదితరులున్నారు.