బేలలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం
13-11-2026 | 03:22pm
బేల నవంబర్ 13(విజయక్రాంతి): జైనథ్ వ్యవసాయ మార్కెట్(Jainath Agricultural Market) పరిధిలోని బేల సబ్ మార్కెట్ యార్డులో(Bela Sub-Market Yard) శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. క్వింటాల్ పత్తికి రూ.8,935 ధరతో కొనుగోళ్లు చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, అశోక్ రెడ్డితో కలిసి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా తూకం కాంటాలకు, పత్తితో వచ్చిన తొలి ఎడ్లబండికి పూజలు నిర్వహించి, రైతును సన్మానించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కొనుగోళ్లు చేపట్టినట్లు తెలిపారు.