పేద ప్రజల ఆర్థిక భరోసా కోసం చేయూత పెన్షన్ల మంజూరి
13-11-2026 | 03:24pm
బోథ్. నవంబర్ 13 ( విజయక్రాంతి.): పేద ప్రజలు ఆర్థిక భరోసా కల్పించాలని దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్లను(State government's 'Cheyutha' pensions) మంజూరు చేయడం జరిగిందని కరత్వాడ గ్రామ సర్పంచ్ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు పెన్షన్ కి సంబంధించిన ప్రోసిడింగును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 27 మంది లబ్ధిదారులకు నూతనంగా పెన్షన్లు మంజూరు అన్నారు.
సామాజిక భద్రత కోసం చేయూత పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి ఎఫ్ఏ మండాడి రాము వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.