ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను(Childrens Day Celebrations) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru) జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.