ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం
13-11-2026 | 03:10pm
జగిత్యాల, నవంబర్ 13 ( విజయ క్రాంతి ): జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్(Former Sarpanch of Kannapur village) సిరిగిరి తిరుపతి భాగ్య దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై నూతన గృహంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి భాగ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సీనియర్ నాయకులు సమిండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్ కూతురు రాజేష్, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.