ట్రాఫిక్ రూల్స్‌పై కఠిన వైఖరి
అశ్వాపురం, నవంబర్ 13 (విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనల అమలులో(Enforcement of traffic rules) ఎలాంటి రాజీ ఉండదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం అశ్వాపురం ఎస్సై శాంతి(Ashwapuram SI Shanthi) హెచ్చరించారు. రహదారి భద్రతే(Road Safety) లక్ష్యంగా వాహనదారులు ట్రాఫిక్ నియమాలు(Traffic Rules) తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి నిర్లక్ష్యపు చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు కేవలం పోలీసుల కోసం రూపొందించినవి కావని, ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే భద్రతా నియమాలని పేర్కొన్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగులుస్తుందని, వాహనం నడిపేటప్పుడు తమ కోసం ఎదురుచూసే కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్సై శాంతి సూచించారు. ప్రజల ప్రాణాల భద్రత విషయంలో పోలీస్ శాఖ రాజీపడబోదని స్పష్టం చేశారు.