రాష్ట్ర స్థాయి ఎస్.జి ఎఫ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్
పోటీలలో పారమిత విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి, నవంబర్ 13(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు(Students of Paramita High School) ఇటీవల హైదరాబాద్ పట్టణంలో రాష్ట్ర స్థాయి ఎస్.జి.ఎఫ్ క్రీడా సమాఖ్య అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ -14 మరియు అండర్-17 బాల బాల బాలికల బాక్సింగ్ క్రీడా పోటీలలో పారమిత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కె. సాయి విగ్నేష్ 90 కేజీ ల విభాగంలో,
9 వ తరగతి చదువుతున్న కె. విశిష్ట 60 కేజీ ల విభాగంలో, 8వ తరగతి చదువుతున్న ఎన్. వరుణ్ రావు 40 కేజీల విభాగంలో, 7వ తరగతి చదువుతున్న ఎమ్. అనుగ్న 60 కేజీల విభాగంలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచి కాంస్య పథకాలు సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీ ల లో పాతకాలు సాదించినా విధ్యార్థులను మరియు బాక్సింగ్ కోచ్ ఎ. రామకృష్ణ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు.ఎం.ప్రసాద రావు, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజి, కవిత ప్రసాద్ సమన్వయకర్త శ్రీనాథ్ లు పాల్గొన్నారు.