జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టులో మహిళా కళాశాల విద్యార్థుల సత్తా

13-11-2026 | 06:58pm

ముకరంపుర, నవంబర్ 13(విజయ క్రాంతి): డిగ్రీ స్థాయిలో(Degree level) నిర్వహించిన 'జిజ్ఞాస' స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో('Jignasa' Student Study Project) కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాల(Government Women's College, Karimnagar) విద్యార్థులు(Students) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి సత్తా చాటారు. కెమిస్ట్రీ, తెలుగు విభాగాల్లో(Department of Chemistry and Telugu) విద్యార్థులు రూపొందించిన రెండు వేర్వేరు ప్రాజెక్టులకు ఈ ప్రతిష్టాత్మక బహుమతులు లభించాయి. కెమిస్ట్రీ విభాగం లో డాక్టర్ రావుల మొగిలి పర్యవేక్షణలో  అరటి తొక్కల నుండి పర్యావరణ అనుకూల బయో డిగ్రేడబుల్ పాలిమర్ తయారీ అనే అంశంపై జారా ఫాతిమా, నవ్యశ్రీ, సిరి చందన, వందన, సమీక్ష బృందం ద్వితీయ బహుమతి గెలుచుకుంది.

తెలుగు విభాగం లోకాజీపేట వెంకటరమణ పర్యవేక్షణలో "దాశరథి గీతాలు - ఉద్యమ స్ఫూర్తి" అనే అంశంపై ఆశ్రిత, కృపామణి, హస్మిత, అర్చన, రమ్య, కోమలత బృందం రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. విజేతలకు మేయర్ శ్రీనివాస్, ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూడిగ్రీ స్థాయి నుంచే ఇలాంటి ప్రాజెక్టులు చేయడం వల్ల విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు.ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ, పీజీ తర్వాత పీహెచ్‌డీలో చేసే పరిశోధనలపై డిగ్రీ స్థాయి నుంచే అవగాహన పెంచుకోవడానికి జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.

మరిన్ని వార్తలు