పాలకుర్తిలో కార్తీక పౌర్ణమికి అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణ

13-11-2026 | 06:56pm

జనగామ, నవంబర్ 13 (విజయక్రాంతి): పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో(Palakurthi Someswara Lakshmi Narasimha Swamy Temple) ఈ నెల 24న కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా గిరి ప్రదక్షిణ, అఖండ జ్యోతి దర్శనం, లక్షదీపోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. దక్షిణ భారతదేశంలో అఖండ జ్యోతి నిర్వహిస్తున్న మూడవ దేవస్థానంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. అఖండ జ్యోతి ప్రజ్వలనను స్వామి దుర్గానందపురి మహారాజ్ చేపట్టనున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహణ అధికారి లక్ష్మీ ప్రసన్న, అర్చకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు