మత్తు ముప్పు: వ్యక్తికే కాదు, వ్యవస్థకూ శాపం

13-11-2026 | 06:42pm

ప్రజాస్వామ్యం లో ఓటు మన వజ్రాయుధం, 

యువతఓటుహక్కునువినియోగించుకోవాలి.

జిల్లా సంక్షేమ అధికారి ఎస్ వి ఈ ఈ పి  నోడల్ ఆఫీసర్, ఈ పి. ప్రేమలత.

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 13, విజయక్రాంతి: వెంకటాపురం మండల(Venkatapuram Mandal) కేంద్రంలోని కాఫీడ్ స్వచ్ఛంద సంస్థ(Coffeed Charitable Organization) ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూర్దు రాజ్ అధ్యక్షతన యువతకు డ్రగ్స్(Drugs) వ్యతిరేక ర్యాలీ, అవగాహన కార్యక్రమం అథ్లెటిక్స్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా సంక్షేమ అధికారి ఎస్ వి ఈ ఈ పినోడల్ ఆఫీసర్ ఈ పి ప్రేమలత  ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా  మాట్లాడుతూ డ్రగ్స్ తో ఒక వ్యక్తి జీవితం కాదు, మొత్తం వ్యవస్థకే పెను ముప్పు అని అన్నారు.

నేడు సమాజంలో జరిగే చాలా రకాల హింసకు కారణం డ్రగ్స్, మత్తు మాదక ద్రవ్యాల(Narcotics) వినియోగమే అని తెలిపారు. డ్రగ్స్ కి బానిసలైన వారు మానవత్వం మరిచి క్రూరంగా ప్రవర్తిస్తారని అన్నారు. నేటి యువతరమే దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మలు అని ఆమెఅన్నారు  ప్రజాస్వామ్యం లో ఓటు మన వజ్రాయుధమని, ఓటు హక్కు(Right to vote) ప్రాముఖ్యత, సమాజ అభివృద్ధిలో ఓటు ప్రాధాన్యం, సక్రమం ఓటు వినియోగంలో యువత పాత్ర గూర్చి వివరించారు.

ఓటు అర్హత వయస్సున్న ప్రతీ యువతీ యువకుడు ఓటరు నమోదు చేసుకోవాలని, అలాగే ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్క యువతీ, యువకులు ఓటు హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. కాఫెడ్ సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూర్దు రాజ్ మాట్లాడుతూ ఈ సమాజ దిశ, దశను మార్చే అద్వితీయమైన శక్తి యువతరానికి ఉందని, అలాంటి యువతరం మత్తు, మాదక ద్రవ్యాల  మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకోకుండా వారికి  సరైన మార్గనిర్దేశం చేయడం కోసం మా కాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపురం & వాజేడు మండలాలనుండి విచ్చేసిన యువకులకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ  ఆర్. ఇందిరమ్మ .బాల్య వివాహా నిషేధ చట్టం - 2006 లోని అంశాలను వివరించి బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మిద్దామని కోరారు.చివరగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ములుగు నుండి విచ్చేసిన ప్రొటెక్షన్ ఆఫీసర్  ఎన్. హరికృష్ణ మాట్లాడుతూ  పి ఓ సిఎస్ఓచట్టం - 2012 లోని అంశాలను సంపూర్ణంగా వివరించారు. అనంతరం నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలైన జట్లకు క్రీడా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్రదర్ జయరాజ్.

 ఫాదర్ జోజప్ప. చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాఫెడ్ సంస్థకి చెందిన . మండలాల ఎన్యూమరేటర్లు  సిబ్బంది,  మండలాలనుండి విచ్చేసిన 400 పైగా మంది యువకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు