పోలీస్స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం
ప్రజా రాకపోకలకు అంతరాయం.. పోలీసుల విధులకు ఆటంకం
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు పోలీస్స్టేషన్(Illendu Police Station) ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి(Attempted suicide) పాల్పడటంతో పాటు, రహదారిపై బైఠాయించి ప్రజా రాకపోకలకు అంతరాయం కలిగించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బండి వెంకటేశ్వర్లు, మద్దెల గోపి, బండి రాజయ్యలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ముగ్గురినీ అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. సమస్యలు, వివాదాలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. ఆత్మహత్యాయత్నం పేరుతో బెదిరింపులకు పాల్పడటం, ప్రజా రాకపోకలను అడ్డుకోవడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.