ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా జయప్రదం చేయండి

15-10-2026 | 04:53pm

దమ్మపేట, అక్టోబర్ 15(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో (CITU Office)గురువారం మండల కమిటీ సమావేశం(Mandal Committee Meeting) రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 25, 26 తేదీలలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను కార్మిక లోకం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ చేస్తామని, స్కీం వర్కర్లు అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, ఐకెపి తదితర రంగాల వారికి జీతాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు గడిచినాగాని ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి ప్రభుత్వ రంగ సంస్తలను ద్వంసం చేస్తుందని తెలిపారు.

నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకించకుండా వాటికి రూల్స్ రూపొందించి అమలు చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మల్టిపుల్ డేస్ మహాధర్నా సిఐటియు ఆధ్వర్యంలో ఇందిరపార్క్ వద్ద జరుగుతుందని, 25న రాష్ట్రంలోని ప్రైవేట్ పరిశ్రమలు,

ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, 26న ప్రభుత్వ రంగ సంస్థల్లోని స్కీం వర్కర్లు, ఔట్సోర్సింగ్ వర్కర్లు, హమాలీ, భవనిర్మాణ కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, నాయకులు సూరమ్మ, జయ, శ్రీదేవి, సత్యవేణి, సత్యవతి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు