వైభవంగా ఆలయ ఉత్సవ వేడుకలు

15-10-2026 | 06:28pm

రాజాపూర్ అక్టోబర్ 15: మండలంలోని చొక్కామ్ పేట్ గ్రామంలో  శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ(Sri Sri Sri Swayambhu Lakshmi Sametha Tirumalanatha Swamy Temple) పునర్నిర్మాణం గరుడధ్వజస్తంభ& విగ్రహ ప్రతిష్ఠపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం ప్రాతః కాల పూజ, లక్ష్మీ గణపతి హోమం నవగ్రహవాస్తు, సర్వతోభద్ర లక్ష్మీనారాయణ హోమం, యంత్రపూజ,

అభిషేకము, మూలమంత్ర హోమం కార్యక్రమం  మహా సంప్రోక్షణ, గ్రామోత్సవం స్వామి వారి పల్లకి ఊరేగింపు మరియు ధాన్యాధివాసం, శయ్యాధివాసం, హారతి, యంత్రపుష్పం పూజలు వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అలివేలు ఆంజనేయులు, చించోడ్ అభిమన్యు రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని హోమం కార్యక్రమలు అలాగే తిరుమలనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ తిరుమలనాథ స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు రాజాపూర్ బాలానగర్ నవాబుపేట్ జడ్చర్ల మండలం నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉమ్మడి దొండ్లపల్లి సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మండల నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ చైర్మన్ యువకులు మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు