తురక కాశ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

15-10-2026 | 06:19pm

రాష్ట్రవ్యాప్తంగా 22 జట్లతో పోటీలు

కోనరావుపేట, అక్టోబర్ 15 (విజయక్రాంతి):యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం(Telangana Turaka Kasha Welfare Association) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను(State-level cricket tournament) గురువారం కోనరావుపేట మండలం నిజామాబాద్ (చాంద్ నగర్) గ్రామంలో ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 22 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి.తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాబ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్, లీగల్ సెల్ ఇన్‌చార్జి సయ్యద్ యామిన్ భాష ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.టోర్నమెంట్‌లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా బరిలోకి దిగి తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

జట్ల మధ్య పోటీలు ఆసక్తికరంగా సాగుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.ఈ టోర్నమెంట్‌కు నిజామాబాద్ సర్పంచ్ సింగం శ్రీహరి, ఉపసర్పంచ్ లంబ రాజు, మల్కాపేట సర్పంచ్ బోయిని దేవరాజు, ప్రముఖ బిల్డర్ సింగం ప్రసాద్,

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం, కాంగ్రెస్ నాయకుడు కార్తీక్ హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువతలో ఐక్యత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న తురక కాశ సంక్షేమ సంఘం నాయకుల కృషిని అభినందించారు.ఈ కార్యక్రమంలో తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సయ్యద్ ముఖిమ్, రాష్ట్ర సలహాదారు షేక్ కరీం, కోనరావుపేట మండల తురక కాశ అధ్యక్షుడు సయ్యద్ మస్తాన్‌తో పాటు వివిధ జిల్లాలకు చెందిన సంఘం అధ్యక్షులు, నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు