అన్నదానం.. మహా పుణ్య దానం

15-10-2026 | 06:25pm

సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు

మోతె, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మండల పరిధిలోని ఉర్లుగొండ గ్రామంలో(Urlugonda Village) సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు . శరన్నవరాత్రి ఉత్సవాలను(Sharannavaratri celebrations) పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అన్నదానం  ద్వారా ఆకలితో ఉన్నవారి కడుపు నింపడంతో పాటు సేవాభావం, మానవత్వం పెంపొందుతాయని, పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత మేరకు పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు