బైంసాలో పోలీస్ ప్రజావాణి
15-10-2026 | 06:21pm
నిర్మల్ అక్టోబర్ 15 ( విజయక్రాంతి): భైంసా పట్టణంలో గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) ఆధ్వర్యంలో పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ బాధితులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు. బాధితులు చెప్పిన సమస్యను ఓపికగా విన్న జిల్లా ఎస్పీ ఆ సమస్య పరిష్కారానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.