ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిపించాలి
సమీక్ష సమావేశం.. పార్టీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం
అశ్వారావుపేట అక్టోబర్ 21 (విజయక్రాంతి) : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల ప్రచారాన్ని(Election campaign) క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వారావుపేట పట్టణంలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశాం నిర్వహించారు.
ఈ సమావేశానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(Jare Adinarayana), ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి ,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి తరలివచ్చారు.
ఎన్నికల ప్రచారం కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా పట్టభద్ర ఓటర్లను నేరుగా కలుసుకునేలా సాగాలని నాయకులు పేర్కొన్నారు. ఓటర్లకు అభ్యర్థి గురించి, ఆయన లక్ష్యాలు, ప్రాధాన్యతల గురించి వివరించి వారి మద్దతు కోరేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని చర్చించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ఉండేలా నాయకులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
పార్టీ అనుబంధ విభాగాలను ఎన్నికల కార్యాచరణలో భాగస్వాములను చేయడం, యువత, మహిళా నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించడం, సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలు, అభ్యర్థి లక్ష్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపైనా దృష్టి సారించారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు తదిత పాల్గొన్నారు.