టేకులపల్లి, ఇల్లందును కరువు మండలాలుగా ప్రకటించాలి
- రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి
- పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి: బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావు
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి, ఇల్లందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Bethampudi Primary Agricultural Cooperative Society) (పీఏసీఎస్) చైర్మన్ లక్కినేని సురేందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల సాగులో నష్టపోయిన రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని కోరారు.
రైతులు తీసుకున్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, తక్షణమే సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకోవాలని సురేందర్రావు కోరారు.