బంగారు ఆభరణాల చోరీ
28-10-2026 | 10:31pm
రూ 70 వేల విలువైన బంగారం అపహరణ
కొండపాక, అక్టోబర్ 28: (విజయక్రాంతి ):తాళం వేసిన ఇంట్లో దొంగలు పడిన సంఘటన తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో(Thimmareddipalli Village) చోటుచేసుకుంది. కుక్కునూరు పల్లి ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోరాయపల్లి రాజు డ్రైవర్ పనికి వెళ్లగా, ఆయన భార్య పనిమీద హైదరాబాదుకు వెళ్ళింది.
ఈ క్రమంలో అక్టోబర్ 27న ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడంతో పాటు బీరువాలోని బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.