సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం(Ashwapuram mandal) మొండికుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Ayushman Arogya Mandiram) పరిధిలో శుక్రవారం నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సీజనల్ వ్యాధుల(Seasonal diseases)పై ఆరోగ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. వర్షాకాలం, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం పీహెచ్సీ పరిధి మొండికుంట ఎంఎల్హెచ్పీ ఈ.దేవి పాల్గొన్నారు.