పేదలకు అండ.. ఇందిరమ్మ భీమా
బెల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) పేదల ప్రజలకు అండగా నిలుస్తోందని బెల్లంపల్లి మునిసిపల్ చైర్పర్సన్ దావస్వాతి రమేష్ బాబు(Municipal Chairperson Davaswathi Ramesh Babu) అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో ఇందిరమ్మ కుటుంబాల జీవిత బీమా పథకాన్ని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భీమా పథకాన్ని సద్వినియోగ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక వార్డ్ కౌన్సిలర్ పున్నం చంద్రు , కౌన్సిలర్ బేతి శ్రావణ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ సీనియర్ నాయకులు , చిలుముల శంకర్,నీలి కృష్ణ,పీక లక్ష్మణ్ బస్తీ వాసులు పాల్గొన్నారు.